ఎవరైతే కృత్రిమ మేధలో పైచేయి సాధిస్తారో వారే మున్ముందు ప్రపంచంపై ఆధిపత్యం చలాయిస్తారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) వల్ల వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఉత్పాదకత, సామర్థ్యం పెరిగి 2030కల్లా ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 14 శాతం మేరకు పెరుగుతుందని అంచనా.
ఈ పెరుగుదల 15.7 లక్షల కోట్ల డాలర్లకు సమానం. ఇది ప్రస్తుత చైనా జీడీపీ 12 లక్షల కోట్ల డాలర్లకన్నా ఎక్కువ. ఏఐలో అగ్రస్థానానికి చేరుకుంటే ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా ‘నంబర్ 1’ కావచ్చునని అమెరికా, చైనా, రష్యాలు ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చైనా 2017 జులైలో జాతీ కృత్రిమ మేధా (ఏఐ) ప్రణాళికను ప్రకటించింది.
గత ఏడాది కేంద్ర వాణిజ్య శాఖ నియమించిన ఏఐ కార్యదళంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక, రక్షణ శాఖలతోపాటు నీతి ఆయోగ్ ప్రతినిధ కూడా సభ్యులుగా ఉన్నారు. మార్చిలో ఈ కార్యదళం సమర్పించిన నివేది ఏఐ రంగంలో భారత ఎదుర్కొంటున్న సవాళ్లను ఏకరవు పెట్టింది. అవి- బిగ్ డేటా కొరత, ఆ సమాచార విశ్లేషణకు మౌలిక వసతులు కొరవడటం, ఏఐ వ్యవస్థల నిర్వహణకు చాలినంతమంది సిబ్బంది లేకపోవడం, ఏఐ వ్యవస్థ నియోగానికి బాగా ఖర్చవడం. ఈ సమస్యలను అధిగమించి ఏఐ రథాన్ని పరుగుల తీయించడానికి కేంద్ర బడ్జెట్లో అయిదేళ్ల కాలావధికి రూ.1,200 కోట్ల మూలనిధిని కేటాయించాలనకార్యదళం సిఫార్సు చేసింది.